Sakshi News home page

Published Thu, Nov 2 2017 4:25 PM

Khichdi not national dish, says minister  - Sakshi

టీ కప్పులో తుఫాన్‌ తెలుసు మనకు. కానీ కిచిడీ పాత్రలో తుఫాన్‌ ఎప్పుడైనా చూశామా? తాజాగా ట్విట్టర్‌లో అదే జరిగింది. ’కిచిడీ’ని జాతీయ వంటకంగా ప్రకటిస్తున్నట్టు కథనాలు రావడంతో ఒక్కసారిగా ట్విట్టర్‌లో ఇది హాట్‌ టాపిగ్గా మారిపోయింది. ఇదే అంశంపై నెటిజన్లు పుంఖానుపుంఖాలుగా కామెంట్లు, జోకుల వరదతో ముంచెత్తడంతో ’కిచిడీ’ వైరల్‌ అయింది. దీంతో కేంద్ర ఆహారశాఖ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ దిగొచ్చి.. కిచిడీని జాతీయ వంటకంగా ప్రకటించడం లేదని స్పష్టత ఇచ్చారు. ’మీరు వండిన కల్పిత ’కిచిడీ’ చాలు. వరల్డ్‌ ఫుడ్‌ ఇండియాలో కిచిడీకి రికార్డ్‌ ఎంట్రీ మాత్రమే ఇవ్వబోతున్నాం’ అని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు.


అంతకుముందు నెటిజన్లు ట్విట్టర్‌లో ’కిచిడీ’పై చేసిన ’కిచిడీ’ అంతా ఇంతా కాదు. ’కిచిడీ’ని జాతీయ వంటకంగా ప్రకటిస్తున్నారన్న కథనాలపై నెటిజన్లు జోకుల మీద జోకులు పేల్చారు. ’ఎవరైనా కిచిడీ తింటున్నప్పుడు చూస్తే.. లేచి నిలబడాలా? సినిమాకు ముందు కచ్చితంగా కిచిడీ తిని తీరాలా? కిచిడీ నచ్చనివారు దేశద్రోహులేనా’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. ’కిచిడీ తినడం వల్ల ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టారని, రాముడు ఒకప్పుడు ప్రతిరోజూ కిచిడీ తినేవారని త్వరలోనే మెసెజ్‌లో పోటెత్తుతాయి’ అని ఓ నెటిజన్‌ చమత్కరించారు. 

Advertisement

What’s your opinion

Advertisement